Sat Dec 21 2024 06:26:15 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు నటిపై ఫిట్ నెస్ ట్రైనర్ అత్యాచారం..
కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్న ఆదిత్య కపూర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి..
తెలుగునటిపై ఫిట్ నెస్ ట్రైనర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిపై నటి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడ్ని నిన్న అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కూఫీ పరేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్న ఆదిత్య కపూర్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
అవసరం తీరిపోయాక.. పెళ్లి ఊసే రాలేదని, పెళ్లిచేసుకోవాలని అడిగితే తనను తిట్టడమే కాకుండా తనపై దాడి కూడా చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించింది. పెళ్లి మాట తీస్తే.. తామిద్దరం సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించడమే కాకుండా.. చంపేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆదిత్య కపూర్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
Next Story