Tue Dec 24 2024 13:47:58 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో తెలుగు దంపతుల మృతి
అమెరికాలో తెలుగు దంపతులు మృతి చెందారు. సరస్సు దాటుతున్న సమయంలో ఐస్ లేక్ లో కూరుకుపోయారు
అమెరికాలో తెలుగు దంపతులు మృతి చెందారు. సరస్సు దాటుతున్న సమయంలో ఐస్ లేక్ లో కూరుకుపోయారు. దీంతో దంపతులు ఇద్దరూ మృతి చెందారు. మృతులిద్దరూ గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన పాలపర్రుకు చెందిన ముద్దన నారాయణ, హరిత దంపతులు అమెరికాలో వీకెండ్ విహార యాత్రకు వెళ్లారు. అరిజోనా ప్రాంతంలో నివాసం ఉండే వీరు ఫినిక్స్ ప్రాంతంలో విహార యాత్రకు వెళ్లారు.
లేక్ లో ఫొటోలు దిగుతుండగా...
ఐస్ లేక్ లో ఫొటోలు దిగుతుండగా ఒక్కసారి ఐస్ కూలిపోయింది. దీంతో దంపతులిద్దరూ కూరుకుపోయారు. హరితను రక్షించేందుకు సహాయక బృందాలు ప్రయత్నించాయి. కానీ ఆమె అప్పటికే మృతి చెందింది. నారాయణ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పిల్లలు ఒడ్డునే ఉండటంతో వారు బతికి పోయారు. ఈ ఏడాది జూన్ లో కుటుంబంతో కలసి నారాయణ స్వగ్రామం వచ్చారని బంధువులు చెబుతున్నారు.
Next Story