Mon Dec 23 2024 13:10:42 GMT+0000 (Coordinated Universal Time)
టెక్సాస్ కాల్పులు : తెలుగు అమ్మాయి మృతి
అమెరికాలో నిన్న జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. ఆమెను తాటికొండ ఐశ్వర్యగా గుర్తించారు
అమెరికాలో నిన్న జరిగిన కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి చెందింది. ఆమెను తాటికొండ ఐశ్వర్యగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని తెలిసింది. నిన్న టెక్సాస్‌లో ఒక షాపింగ్ మాల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించిన సంగతి తెలిసిందే.
తాటికొండ ఐశ్వర్యగా...
ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య మృతి చెందింది. ఐశ్వర్య ఒక కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఐశ్వర్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. టెక్సాస్ కాల్పులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Next Story