Sun Dec 22 2024 07:08:20 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చెరువులో కారు.. ఎనిమిది మంది మృతి
ఛత్తీస్ గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు చెరువులో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు
ఛత్తీస్ గడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పి కారు చెరువులో పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బలరామ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతి వేగంతో వచ్చిన కారు చెరువలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రయాణికులు మరణించారు.
సహాయక చర్యలు...
స్థానికులు ఈ విషయం తెలిసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. చెరువులో మునిగిన కారును బయటకు తీసేందుకు క్రేన్లను ఉపయోగిస్తున్నారు. అయితే మృతులు ఎవరన్నది ఇంకా తెలియలేదు. అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాధమికంగా పోలీసులు నిర్ధారించారు.
Next Story