Sun Dec 01 2024 06:32:07 GMT+0000 (Coordinated Universal Time)
Hyderabad : హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు..ఇద్దరు మృతి
హైదరాాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూవీలర్ పై వెళుతున్న భార్యాభర్తలను కారు ఢీకొట్టింది
హైదరాబాద్ నగరంలో ఇటీవల హిట్ అండ్ రన్ కేసులు ఎక్కవవుతున్నాయి. ఈరోజు ఉదయం నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూవీలర్ పై వెళుతున్న భార్యాభర్తలను కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. కారు వేగంగా వచ్చి ఆటోతో పాటు టూ వీలర్ ను కూడా ఢీకొట్టింది. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలించి...
గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ పవన్ మద్యం తాగి వాహనం నడపడటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. ఈ ప్రమాదంతో ఒక కుటుంబం తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారికి ఏడాది క్రితమే పెళ్లయిందని, భార్య గర్భవతి అని చెబుతున్నారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story