Mon Dec 23 2024 02:29:14 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముమ్మడివరం వైసీపీ ఎమ్మెల్యే బంధువులు ఐదుగురు మృతి
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు మృతి చెందారు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులంతా వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబ సభ్యులేనని తెలిసింది. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబీకులు ఈ ప్రమాదంలో మరణించారని చెబుతున్నారు. అమెరికా జాన్సన్ కౌంటీలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు.
ఒకే కుటుంబానికి చెందిన...
రెండు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో మరణించినట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమెరికాలో ఉన్న తన కుమార్తెను చూసేందుకు వెళ్లి ఈ ప్రమాదానికి గురయినట్లు తెలిసింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఎంబసీ అధికారులతో సంప్రదిస్తున్నారు. మృతదేహాలను ఏపీకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story