Mon Dec 23 2024 17:41:18 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి మృతి
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కలకడ మండలంలో ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైయింది. ట్రావెల్ బస్సు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
ఆటోను బస్సు ఢీకొట్టగా...
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారు మృతి చెందారు. అతి వేగంతో పాటు రోడ్డును ఆటో దాటుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story