Mon Dec 23 2024 03:29:58 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి
ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు
ఛత్తీస్‌ఘడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. కాంకేర్ జిల్లాలోని కోరేర్ సమీపంలో ఆటోను ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభశించింది. ఆటోలో ఉన్న విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. ఆటో డ్రైవర్ తో పాటు మరో విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యారు.
సీఎం సంతాపం...
గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను కొరేర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు.
Next Story