Tue Dec 24 2024 14:40:54 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఎంత విషాదం.. కారు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని బెలగావి వద్ద జరిగిన ఈ ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతి చెందిన వారంతా ధార్వాడ్లోని లంగోటికి చెందిన వారుగా పోలీసులు తెలిపారు. అతి వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్నందునే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
మృతులంతా...
గాయపడిన ముగ్గురిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణమంతా బంధువుల ఆక్రందనలతో మిన్నంటింది. మృతి చెందిన వారుఅంతా చిన్న వయసు వారే. యాభై ఏళ్ల లోపు వయసు వారే కావడం గమనార్హం. మృతులను షారూక్ పెండారి, ఇక్బాల్ జమాదార్, సానియా లంగోటి, ఉమ్రాబేగం లంగోటి, షబానాబాను లంగోటి, పరన్ లంగోటిగా పోలీసులు తెలిపారు.
Next Story