Thu Apr 24 2025 21:54:54 GMT+0000 (Coordinated Universal Time)
నిజామాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. నిజామాబాద్ నుంచి బోధన్ వస్తునన ఆటో అర్సపల్లి పెట్రోలు పంపు వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు.
నలుగురి మృతి...
అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు బతికి బయటపడగలిగారని పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story