Fri Dec 20 2024 11:33:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం.. కారు వచ్చి బైకును ఢీకొట్టి.. ఐదుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అతి వేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి కూడా మరణించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్డు మొత్తం రక్తసిక్తమయింది.
తిరుచ్చి - మధురై రహదారిపై...
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి - మధురై రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీల్లో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాద స్థలి నుంచి మృతదేహాలను తొలగించి ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
Next Story