Fri Dec 27 2024 14:18:14 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు, రెండు కార్లు, రెండు లారీలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. వేగంగా వచ్చి ఒకదానినొకటి ఢీకొట్టుకున్నాయి. సంఘటన స్థలిలోనే ఐదుగురు మరణించారు. అనేక మందికి తీవ్ర గాయాలయాయి. కడలూరు తురుచ్చి నేషనల్ హైవేపై వేప్పుర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
వేగంగా ఢీకొనడం వల్లనే....
ఘటన స్థలిలోనే ఐదుగురు మరణించారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story