Fri Dec 27 2024 05:48:36 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఘోర రోడ్డు ప్రమాదం...నలుగురు మెడికోలు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మెడికోలు అక్కడికక్కడే మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మెడికోలు అక్కడికక్కడే మరణించారు. మెడికల్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందని వార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు.
అతి వేగంగా...
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతి చెందిన వారంతా విల్లుపురం జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. వీరు తిరువణ్ణామలై నుంచి దిండివనానికి వెళుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నిండింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story