Mon Dec 23 2024 04:28:04 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తమిళనాడులోని సేలం - వృద్ధా చలం జాతీయ రహదారిపై నిన్న రాత్రి లారీ, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన వారు కార్మికులుగా గుర్తించారు. కొందరు గాయాల పాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పార్టీ సమావేశానికి వెళ్లి వస్తుండగా...
తిరుచ్చి సమీపంలో వీసీకే సమావేశానికి హాజరైన కార్యకర్తలు వ్యాన్ లో తిరిగి వస్తుండటగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
Next Story