Mon Dec 23 2024 07:46:30 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. ఒక టూరిస్ట్ వాహనం చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఉలుందూరుపేటలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో పథ్నాలుగు మంది గాయపడ్డారు. గాయపడిన వారిని విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
నిద్రమత్తులో...
అయితే ప్రమాదం అతి వేగంతో వస్తూ నిద్రమత్తులో ఉండటం వల్లనే జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ ను సరిదిద్దుతున్నారు.ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు కూడా మరణించారు. మంబాక్కం నుంిచ తిరుచెందూర్ వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెండ్ జరిగింది. ఆలయ దర్శనం పూర్తి చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగిందని గాయపడిన వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story