Sat Dec 28 2024 22:28:10 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు బోల్తా : ముగ్గురి మృతి
తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. అదుపు తప్పి బస్సు బోల్తా పడటంతోనే ఈ ఘటన జరిగినంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని చెబుతున్నారు.
అతి వేగమే...
మరోవైపు బస్సు అదుపుతప్పిన సంఘటన తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story