Mon Dec 23 2024 13:30:31 GMT+0000 (Coordinated Universal Time)
తనతో సహజీవనం కొనసాగించలేదని.. మహిళపై దారుణం
వెంకటలక్ష్మి అనే మహిళ భర్త చనిపోయాడు. దాంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లు
భర్త చనిపోవడంతో.. అతను ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లు బాగానే గడిచింది. కానీ.. అతని చిత్రహింసలు భరించలేక ఆమె దూరంగా ఉంటోంది. అది భరించలేని ఆ వ్యక్తి ఆ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. కిరోసిన్ పోసి ఆమెను తగులబెట్టాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటలక్ష్మి అనే మహిళ భర్త చనిపోయాడు. దాంతో వెంకటేష్ అనే వ్యక్తి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరూ కొన్నాళ్లు సహదజీవనం చేశారు.
చిత్రహింసలు పెట్టడంతో..
కానీ.. వెంకటేష్ ప్రవర్తనలో తేడా వచ్చింది. వెంకటలక్ష్మిని చిత్ర హింసలకు గురి చేయడంతో.. భరించలేక ఆమె అతడిని వదిలి దూరంగా ఉంటోంది. వెంకటలక్ష్మి దూరంగా ఉండటం తట్టుకోలేకపోయిన వెంకటేష్.. తనతో కలిసి ఉండాలంటే వేధించసాగాడు. వెంకటలక్ష్మి ససేమిరా కుదరదని చెప్పడంతో..ఆగ్రహంతో ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. బుధవారం సాయంత్రం 8 గంటలకు వెంకటేష్ ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంటిలో ఉన్న వెంకటలక్ష్మితో గొడవపడ్డాడు. కోపంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ క్రమంలో వెంకటేశ్, వెంకటలక్ష్మి ఇద్దరికీ మంటలంటుకున్నాయి. ఇద్దరూ బిగ్గరగా కేకలు వేయడంతో.. స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టి మంటలను ఆర్పివేశారు.
అప్పటికే తీవ్ర కాలిన గాయాలతో వెంకటలక్ష్మి మృతి చెందగా.. వెంకటేష్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story