Mon Dec 23 2024 02:50:15 GMT+0000 (Coordinated Universal Time)
కొడుకు తలనరికి.. సంచిలో పెట్టుకుని..
కిషోర్ తల్లి సంపాదన కోసం పనులు చేసేందుకు గల్ఫ్ దేశం వెళ్లింది. అక్కడి నుండి కొడుకు కిషోర్ కు డబ్బులు పంపుతోంది.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన ఒక హత్య.. స్థానికంగా కలకలం రేపింది. నకరికల్లు మండలం గుండ్లపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనమైంది. గ్రామానికి చెందిన వీరయ్య (45) అతని కొడుకు కిషోర్ (25)ను అతి కిరాతకంగా నరికి చంపాడు. అందుకు కారణం మద్యానికి బానిసైన వీరయ్యకు డబ్బులివ్వకపోవడమే.
కొడుకు తల, మొండెంను వేరు చేసిన వీరయ్య.. తలను గోనె సంచిలో వేసుకుని గ్రామంలో తిరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. వీరయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కిషోర్ మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కిషోర్ తల్లి సంపాదన కోసం పనులు చేసేందుకు గల్ఫ్ దేశం వెళ్లింది. అక్కడి నుండి కొడుకు కిషోర్ కు డబ్బులు పంపుతోంది. మద్యానికి బానిసైన వీరయ్య తరచూ డబ్బుల కోసం కిషోర్ ను అడుగుతుండగా.. డబ్బంతా మద్యానికి ధారపోస్తున్నాడని ఇవ్వలేదు. ఆ కోపంతోనే వీరయ్య కొడుకుని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. కొడుకు మరణవార్త విన్న తల్లి అలివేలు.. వీడియోకాల్ లో కొడుకుని చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది. కొడుకు, కూతురికి పెళ్లిళ్లు చేసిన తర్వాత రూ.5 లక్షల అప్పు ఉండటంతో.. రెండేళ్ల ఒప్పందంపై గల్ఫ్ కు వచ్చానని.. ఇంతలోనే కొడుకు తండ్రి చేతిలో ఇలా చనిపోతాడని అనుకోలేదని వాపోయింది.
Next Story