Mon Dec 23 2024 12:09:45 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటిపై దాడి చేసి.. మహిళలను దుర్భాషలాడి.. కొట్టి.. మందుబాబుల వీరంగం
కారు నీ ఇంటి ముందు పెట్టుకో.. రోడ్డు మీద ఎందుకు పెట్టావ్.. అంటూ అర్ధరాత్రి ఓ కుటుంబం మీద మందుబాబు దాడిచేసిన..
రంగారెడ్డి జిల్లాలోని హైదర్ షాకోట్ సన్ సిటీలో శ్రీకాంత్, అతని గ్యాంగ్ గత అర్థరాత్రి ఓ కుటుంబం పై దాడి చేసి నానా హంగామా సృష్టించారు. పీకలదాకా మద్యం సేవించిన ఈ గ్యాంగ్ ఒక్కసారిగా ఓ కుటుంబం పై దాడికి పాల్పడుతూ ఆ కుటుంబంలోని భార్యాభర్తల మొహాలపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. తల్లిదండ్రులకు వాళ్ల కూతురు అడ్డు వచ్చింది. దీంతో శ్రీకాంత్ అతని గ్యాంగ్ అడ్డు వచ్చిన కూతురిని బూతులు తిడుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. అంతేకాకుండా శ్రీకాంత్ మద్యం మత్తులో తూలుతూ ఇంటి యజమానిని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అతని మీద చేయి చేసుకున్నాడు. ఇంటి ఓనర్ కార్ అద్దాలు మొత్తం ధ్వంసం చేస్తూ నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడాడు.
కారు నీ ఇంటి ముందు పెట్టుకో రోడ్డు మీద ఎందుకు పెట్టావ్ అంటూ అర్ధరాత్రి ఓ కుటుంబం మీద మందుబాబు దాడిచేసిన ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. మా వీడియో తీస్తావా అంటూ ఒకరి మొబైల్ ఫోను పగలగొట్టారు. మహిళలని కూడా చూడకుండా ఏకవచనంతో మాట్లాడుతూ.. ఈ గ్యాంగ్ రెచ్చిపోయింది. అనురాధ కుటుంబం వెంటనే నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. కులం పేరుతో దూషించి మాపై శ్రీకాంత్ రెడ్డి, అతని అనుచరులు దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. నార్సింగి పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు నాంపల్లిలోని ఏరియా హాస్పిటల్ లో ఆయమ్మగా పనిచేస్తుంది.
Next Story