Mon Dec 23 2024 09:07:04 GMT+0000 (Coordinated Universal Time)
నన్ను అంకుల్ అంటావా అంటూ.. యువతి పై పిడిగుద్దులు !
ఈ దారుణ ఘటన.. ఉత్తరాఖండ్ లోని ఉదమ్ సింగ్ నగర్, సితార్ గంజ్ లో జరిగింది. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్ దుకాణంలో 18 ఏళ్ల యువతి
సాధారణంగా వయసులో పెద్దవాళ్లను చూసిన ఎవరైనా అంకుల్, ఆంటీ అని సంబోధించడం సామాన్యం. కానీ.. తనను అంకుల్ అని పిలిచిన ఓ యువతిపై 35 ఏళ్ల వ్యక్తి పిడిగుద్దులతో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన.. ఉత్తరాఖండ్ లోని ఉదమ్ సింగ్ నగర్, సితార్ గంజ్ లో జరిగింది. ఖాటిమా రోడ్డులో ఉన్న ఓ స్పోర్ట్ దుకాణంలో 18 ఏళ్ల యువతి రాకెట్ కొనుగోలు చేసింది. ఆ రాకెట్ కు డ్యామేజీ ఉండటంతో.. దానిని తిరిగి మార్చుకునేందుకు మళ్లీ ఆ దుకాణానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆ షాపులో పనిచేసే 35 ఏళ్ల మోహిత్ కుమార్ ను అంకుల్ అని పిలిచింది.
కోపంతో ముఖంపై పిడిగుద్దులు
అంతే.. నన్ను అంకుల్ అంటావా అంటూ.. కోపంతో ఆ యువతి ముఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు మోహిత్. దీంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. మోహిత్ పిడిగుద్దుల ధాటికి యువతి ముఖం వెంట రక్తం ధారలుగా కారింది. దాంతో కంగారు పడిన షాపు యజమాని వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. ఆస్పత్రి వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. బాధితురాలి తండ్రి మోహిత్ పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story