Sun Dec 22 2024 21:59:02 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. ఇద్దరు కొడుకుల తలలు నరికి చంపిన తల్లి
హమీర్ పుర్ బిజౌరా అనే గ్రామంలోని అజిత్ యాదవ్, నీతూ యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె పారీకి 9 సంవత్సరాలు..
నవమాసాలు మోసి కన్న ఇద్దరు కొడుకులను ఓ తల్లి అతి దారుణంగా నరికి చంపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఇద్దరు బిడ్డల శరీరాలు, తలలు వేర్వేరుగా పడి ఉన్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గాజీపుర్ జిల్లాలోని మర్దా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ దారుణం.
హమీర్ పుర్ బిజౌరా అనే గ్రామంలోని అజిత్ యాదవ్, నీతూ యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె పారీకి 9 సంవత్సరాలు ఉండగా.. ఇద్దరు కొడుకులైన హ్యాపీ కి ఆరేళ్లు, హార్దిక్ కు 10 నెలల వయసు ఉంటుంది. అజిత్ యాదవ్ జమ్మూలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం (ఏప్రిల్ 7) రాత్రి తన ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రించేందుకు గదిలోకి వెళ్లిన నీతూ యాదవ్ అదే రాత్రి.. పసివాళ్లన్న కనికరం కూడా లేకుండా కత్తితో దాడి చేసింది. ఇద్దరు కుమారుల తలలను నీతూ యాదవ్ నరికేసింది.
తమ్ముళ్లపై అమ్మ కత్తితో దాడి చేయడం చూసిన పారీ.. ప్రాణాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇద్దరు బిడ్డల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ కు పంపారు. నిందితురాలైన నీతూ యాదవ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించిందని గాజీపుర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ తెలిపారు. బాధితురాలి మానసిక పరిస్థితి సరిగా లేదని, నాలుగేళ్లుగా ఆమె చికిత్స తీసుకుంటుందని తెలిపారు.
Next Story