Sun Dec 22 2024 19:59:47 GMT+0000 (Coordinated Universal Time)
కోడికూర కోసం చెల్లెలిని వెంటాడి.. నరికి చంపిన అన్న
నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తుంది. అన్నను చూసేందుకు వారంరోజుల క్రితం..
కూనవరం : క్రైం రేటు విపరీతంగా పెరిగిపోతోంది. చిన్న చిన్న కారణాలకు ఆగ్రహంతో సొంతవారినే కడతేరుస్తున్నారు. మద్యం తాగేందుకు తల్లి డబ్బులివ్వలేదని, తండ్రి మందలించాడని, అడిగింది చేయలేదని.. ఇలా చిన్న చిన్న కారణాలతోనే తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, చెల్లి లను చంపేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. చెల్లెలు కోడికూర వండలేదని ఆగ్రహంతో ఊగిపోయిన అన్న.. ఆమెను గొడ్డలితో నరికి చంపాడు. కూనవరం సీఐ గజేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూనవరం మండలం కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
నంద చెల్లెలు సోమమ్మ (20) తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తుంది. అన్నను చూసేందుకు వారంరోజుల క్రితం కన్నాపురం వచ్చింది. చెల్లెలు రావడంతో.. నంద భార్య రెండ్రోజుల్లో వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఫుల్లుగా మద్యం తాగి, చికెన్ తీసుకుని ఇంటికెళ్లాడు నంద. కూర వండాలని సోమమ్మకు చెప్పగా.. నీరసంగా ఉందని, వండలేనని చెప్పింది. దాంతో నంద ఆమెతో గొడవకు దిగాడు. తాను బయటికెళ్లి వచ్చేసరికి కూరవండాలని హెచ్చరించాడు. శుక్రవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన నంద.. కోడికూర వడ్డించాలని సోమమ్మను అడగ్గా.. ఆమె వండలేదని చెప్పింది. దాంతో ఆమెపై దాడి చేశాడు. సోమమ్మ అరుస్తూ బయటకు పరుగెత్తగా.. గొడ్డలితో ఆమెను వెంటాడి నరికేశాడు.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి మృతి
సోమమ్మ పెద్ప పెట్టున అరవడంతో చుట్టుపక్కల వారంతా ఏం జరిగిందోనని అక్కడకు చేరుకునే సరికే సోమమ్మ రక్తపుమడుగులో చలనం లేకుండా పడి ఉంది. దీంతో గ్రామస్థులు నిందితుడిని చెట్టుకు కట్టేసి ఉంచారు. సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story