బైక్ పై నుంచి పడి తల్లి మృతి.. భరించలేక కొడుకు కూడా..
నరేష్ ఏడుస్తూ.. తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. బంధువులతో కలిసి తండ్రి కొడంగల్ ఆస్పత్రికి చేరుకున్నాడు. కానీ అక్కడ ..
వికారాబాద్ : తనను నవమాసాలు మోసి, కని పెంచిన అమ్మ ఇక లేదన్న విషయాన్ని ఆ కొడుకు జీర్ణించుకోలేకపోయాడు. తన తల్లి తన కారణంగానే కన్నుమూసిందన్న బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా యాలాల మండలంలోని బెన్నూర్ గ్రామానికి చెందిన నరేష్ తన తల్లి లక్ష్మితో కలిసి కొడంగల్ లో ఉన్న ఓ ఆలయానికి వెళ్లాడు. దర్శనానంతరం ఇద్దరూ తిరిగి నరేష్ బైక్ పై ఇంటికి బయల్దేరారు. ఈ క్రమంలో ఉడిమేశ్వరం వద్ద లక్ష్మి ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి కిందపడిపోయింది. తల్లి పడిపోయిన విషయాన్ని నరేష్ గమనించకుండా అలాగే ముందుకెళ్లిపోయాడు. తన వెనకాలే వస్తున్నవారు విషయం చెప్పగా.. బైక్ వెనక్కి మళ్లించి వెళ్లి చూశారు. తల్లి తీవ్రగాయాలతో విలవిల్లాడుతుండటంతో హతాశుడయ్యాడు. వెంటనే కొడంగల్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.