Mon Dec 23 2024 08:15:14 GMT+0000 (Coordinated Universal Time)
సోదరిపై అన్న లైంగిక వేధింపులు.. 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి..
విషయం ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తా.. అని బెదిరించడంతో ..అన్న చేసే వికృత పనులు అధికమవుతుండటంతో
తోడబుట్టిన తోబుట్టువుకి అండగా, నీడగా ఉండాల్సిన అన్నయ్యే ఆమె పాలిట మృగం అయ్యాడు. ఎనిమిదేళ్లపాటు ఆమెను లైంగికంగా వేధించాడు. ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తానని బెదిరించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని అమ్రావతి జిల్లాలో 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ మహిళ వయసు 44 సంవత్సరాలు. బాల్యంలో రాజ్ పేఠ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముండేవారు. ఆమె 13వ ఏట నుంచి సొంత సోదరుడే లైంగికంగా వేధించాడు. అలా ఎనిమిదేళ్లు అతని కర్కశత్వాన్ని చూపించాడు.
విషయం ఎవరికైనా చెప్తే నీ అంతు చూస్తా.. అని బెదిరించడంతో భయపడి మిన్నకుండిపోయింది. అన్న చేసే వికృత పనులు అధికమవుతుండటంతో భరించలేకపోయింది. తనపై జరుగుతున్న రాక్షస కాండను బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. పాపం.. వాళ్లు కూడా పట్టించుకోలేదు. కుటుంబం పరువు పోతుందని మరోసారి ఇలాంటి కంప్లైంట్లు చేయవద్దని బెదిరించారు. కాలక్రమంలో ఆమె తండ్రి మరణించగా.. తల్లి అనారోగ్యానికి గురైంది. బాధితురాలికి పెళ్లై.. పిల్లలు కూడా పుట్టారు. కానీ చిన్నతనంలో ఆమె తన అన్న చూపించిన నరకాన్ని మాత్రం మరిచిపోలేకపోయింది.
ఎంత మరిచిపోవాలని ప్రయత్నించినా.. గతం తాలూకు పీడ జ్ఞాపకాలు వెంటాడుతుండటంతో.. ఇక నిజం బయటపెట్టాలని భావించింది. తన భర్తకు జరిగిన విషయాన్ని చెప్పింది. అనంతరం భర్తలో కలిసి.. ముంబైలోని మలాడ్ లో నివాసముంటోన్న సోదరుడిపై అమ్రావతి పోలీసులకు, ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, నోయిడా ఠాణాలోనూ ఫిర్యాదులు చేసింది. తనకు జరిగిన ఘోరాన్ని 30 ఏళ్లకు పైగా బయటపెట్టకపోవడంపై పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story