Mon Dec 23 2024 14:32:27 GMT+0000 (Coordinated Universal Time)
జైలులో తోటి ఖైదీని రేప్ చేసిన యువకుడు.. పాపం బాధితుడు
జైలులోకి వేస్తే మార్పు వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అతడు మారలేదు. సాటి మగవ్యక్తితో అసహజ సంభోగంలో పాల్గొన్నాడు. లైంగికంగా వేధించడం, బెదిరించడం వంటివి పాల్పడ్డాడు.
జైలులోకి వేస్తే మార్పు వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అతడు మారలేదు. సాటి మగవ్యక్తితో అసహజ సంభోగంలో పాల్గొన్నాడు. లైంగికంగా వేధించడం, బెదిరించడం వంటివి పాల్పడ్డాడు. ఈ ఘోరం చేసిన నిందితుడి వయసు 19 సంవత్సరాలే..! ముంబై లోని ఆర్థర్ రోడ్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆర్థర్ రోడ్ జైలులోని 19 ఏళ్ల ఖైదీ తన బ్యారక్ ఉన్న 20 ఏళ్ల యువకుడిపై బలవంతం చేశాడని ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి మాట్లాడుతూ, ఆదివారం తెల్లవారుజామున జైలులోని ఒక బ్యారక్‌లో నిందితుడు బాధితుడి దగ్గరకు వచ్చి తెల్లవారుజామున 2.30-3.30 గంటల మధ్య గొడవ పడ్డాడన్నారు. ఆ తర్వాత నిందితుడు బాధితుడిని బలవంతం చేశాడు. ఈ ఘటనను ఎవరికీ చెప్పవద్దని నిందితుడు బాధితుడిని బెదిరించాడు. అయితే ఇది ఒక రోజు జరిగిన ఘటన మాత్రమే కాదని.. చాలా రోజులుగా జరుగుతున్న ఘటన అంటూ బాధితుడు పోలీసు ఉన్నతాధికారుల ముందు వాపోయాడు.
కొన్నాళ్ళుగా తనను తోటి ఖైదీ లైంగికంగా వేధిస్తున్నాడని, తనపై అసహజ లైంగిక దాడికి పాల్పడుతున్నాడని జైలు సిబ్బందికి ఫిర్యాదు చేస్తున్నాడు. జైలు సిబ్బంది ఆ ఖైదీ ఫిర్యాదును ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆ ఖైదీ ఏకంగా జైలు అధికారులను కలిసి మొత్తం చెప్పేశాడు. స్పందించిన అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించి ఖైదీ ఫిర్యాదు చేసినా పట్టించుకోని జైలు సిబ్బంది, పోలీసులకు నోటీసులు ఇచ్చారు. ఖైదీపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు కూడా రేప్ కేసులో నిందితుడిగానే శిక్ష అనుభవిస్తుండగా.. బాధితుడు కూడా రేప్ కేస్ లోనే శిక్ష అనుభవిస్తున్నాడు. ఇద్దరూ అత్యాచార కేసులో నిందితులు కావడంతో ఒకే బ్యారక్ లో గత కొద్దీ నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. తోటి ఖైదీని దారుణంగా కొడుతూ అత్యాచారానికి పాల్పడిన టీనేజర్ పై ఐపీసీ 377 సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
- Tags
- crime news
- mumbai
Next Story