Thu Dec 19 2024 17:09:52 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు ఏపీ, తెలంగాణ యువకులు
ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు తెలంగాణ,పీ ఏపీకి చెందిన యువకులున్నారు. వారి కోసంఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు
ఎన్ఐఏ మోస్ట్ వాంటెండ్ జాబితాలో ముగ్గురు తెలంగాణ,పీ ఏపీకి చెందిన యువకులున్నారు. వారి కోసం నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గాలిస్తున్నారు. ఎన్ఐఏ అధికారులు ఇటీవల పలు రాష్ట్రాలలో దాడులు జరిగిన నేపథ్యంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. అందులో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఉన్నారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
ఈ ముగ్గురి కోసం..
దీంతో ఏపీలో ఉన్న ముగ్గురి కోసం ఎన్ఐఏ అధికారులు వెతుకులాట ప్రారంభించారు. పీఎఫ్ఐతో వీరికి సంబంధాలున్నట్లు గుర్తించారు. వీరి ఆచూకీ తెలిపితే పారితోషకం కూడా ఇస్తామని ఎన్ఐఏ అధికారులు ప్రకటించడం విశేషం. తెలంగాణకు చెందిన అబ్దుల్ సలీం, అబ్దుల్ అలియాస్ ఎంఏ అహ్మద్, ఏపీకి చెందిన షేక్ అహ్మద్ కోసం ఎన్ఐఏ అధికారులు వెదుకుతున్నారు.
Next Story