Sat Nov 23 2024 02:07:47 GMT+0000 (Coordinated Universal Time)
కసాయి తల్లి.. పుట్టిన బిడ్డను భూమిలో పాతి పెట్టినా?
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను ఒక తల్లి ఆసుపత్రి సమీపంలో భూమిలో పాతిపెట్టి వెళ్లింది
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన తన బిడ్డను ఒక తల్లి ఆసుపత్రి సమీపంలో భూమిలో పాతిపెట్టి వెళ్లింది. అయినా ఆ బిడ్డ బతికి బట్ట కలిగింది. నిండూ నూరేళ్లు... తన ఆయుష్షు పోసుకుని జీవించాలని ప్రతి తల్లి బిడ్డను ఆశీర్వదిస్తుంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రం కసాయి తల్లి తనకు అప్పుడే పుట్టిన బిడ్డను భూమిలో పాతి పెట్టి వెళ్లిపోయింది. అదృష్ట వశాత్తూ బిడ్డ సగభాగం భూమిలోను, మిగిలిన సగభాగం బయటకు వచ్చింది.
బతికి బయటపడి....
బిడ్డ ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి సిబ్బంది సాయంతో ఆ బిడ్డను బయటకు తీశారు. బిడ్డకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. దీంతో బిడ్డ సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఆసుపత్రిలోని పిల్లల వార్డుకు బిడ్డను తరలించి సంరక్షిస్తున్నారు. బిడ్డను భూమిలో పాతి పెట్టి వెళ్లిపోయిన తల్లి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story