Sun Dec 22 2024 16:20:18 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : ములుగు జిల్లాలో ఇద్దరిని నరికి చంపిన మావోయిస్టులు
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపేశారు.
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. మావోయిస్టులు ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరిని చంపేశారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో పేరూరు పంచాయతీ కార్యదర్శి రమేష్ తో పాటు అర్జున్ లను నిన్న రాత్రి మావోయిస్టులు గొడ్డలితో నరికి చంపేశారు. ఇన్ ఫార్మర్ల నెపంతో ఈ దారుణానికి మావోయిస్టులు ఒడిగట్టినట్లు తెలిసింది.
ఇన్ ఫార్మర్లని భావించి...
వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఈ దారుణానికి పాల్పడినట్లు చెబుతున్నారు. గత కొంత కాలంగా రమేష్ మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నాడు. ఈ మేరకు వారిని చంపిన తర్వాత అక్కడ లేఖను కూడా వదిలేసి వెళ్లారు. ఇద్దరిని మావోయిస్టులు చంపేయడంతో పోలీసులు అప్రమత్తమై తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story