Thu Jan 16 2025 16:04:43 GMT+0000 (Coordinated Universal Time)
బీచ్ లో విషాదం.. ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. సింగరాయకొండ సమీపంలో ఉన్న పాకల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు.
ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. సింగరాయకొండ సమీపంలో ఉన్న పాకల బీచ్ లో సముద్ర స్నానానికి వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో ముగ్గురిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. మరో ముగ్గురు మరణించారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే ఘటన స్థలికి చేరుకుని స్థానిక మత్స్యకారుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు యువతులు, ఒక యువకుడి మృతదేహం మాత్రం స్థానికులకు లభించింది.
గాలింపు చర్యలు...
మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు దగ్గరలోని పొన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు జెస్సిక, నోసిన మాధవ, యామినిగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story