Sun Dec 22 2024 17:49:29 GMT+0000 (Coordinated Universal Time)
పోలీస్ స్టేషన్ లోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ
వింజమూరు పోలీస్ స్టేషన్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
వింజమూరు పోలీస్ స్టేషన్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో అధికారులు రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ లో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వైసీపీ నేత, ఒక ప్రధాన పత్రిక విలేకరి ఇందులో ఉన్నారు. వీరిద్దరూ ఫిర్యాదు చేసుకునేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చి మరోసారి ఘర్షణకు దిగారు
పాతకక్షలే....
పాతకక్షలే ఈ ఘర్షణకు కారణమని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల ఎదుటే ఇద్దరూ కొట్లాటకు దిగడంతో పోలీసులు ఇద్దరిని వారించారు. అయితే స్టేషన్ లోనే గొడవలకు దిగడంతో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వర్గాలపై కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Next Story