Fri Dec 20 2024 17:12:26 GMT+0000 (Coordinated Universal Time)
కార్లలో మంటలు... నలుగురి సజీవ దహనం
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని మంటలు చెలరేగడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. రాజస్థాన్ లోని ఝలావర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందచేస్తున్నారు.
మధ్యప్రదేశ్ కు చెందిన....
ప్రమాదంలో మరణించిన వారు మధ్యప్రదేశ్ జిల్లాలోని దుంగార్గావ్ గ్రామానికి చెందిన నారాయణసింగ్, భానులు అన్నదమ్ములు. కార్లలో ఒక్కసారి మంటలు రావడంతో కార్లలో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులే. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story