Thu Apr 03 2025 03:00:28 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో కాల్పులు.. ఐదుగురికి గాయాలు
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. యూఎస్ లోని కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ లో ఈ ఘటన జరిగింది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. యూఎస్ లోని కొలరాడాలో అరోరా నగరంలోని సెంట్రల్ హైస్కూల్ లో ఈ ఘటన జరిగింది. గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు యువకులు గాయపడినట్లు తెలుస్తోంది. పాఠశాల పార్కింగ్ వద్ద ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు ఎవరనేది?
కాల్పులకు గల కారణాలు తెలియరాలేదు. దీంతో పాటు కాల్పులు జరిపిన వ్యక్తి ఎవరనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story