Fri Dec 20 2024 17:21:55 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ముంబయిలో అగ్ని ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం
ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెంబూర్ లోని ఒక దుకాణంలో చెలరేగిన మంటలతో ఐదుగురు సజీవ దహనమయ్యారు
ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చెంబూర్ లోని ఒక దుకాణంలో చెలరేగిన మంటలతో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వ్యాపారులు భయంతో రోడ్డు మీదకు పరుగులు తీశారు. అగ్ని మాసక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
కారణాలు మాత్రం...
అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఐదుగురు సజీవదహనం కావడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు సంతాపాన్ని ప్రకటించింది. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story