Sun Apr 06 2025 11:09:47 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో రోడ్డు ప్రమాదం... ఐదుగురి మృతి
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడం విషాదం నింపింది. కృష్ణారెడ్డి, పెంచలమ్మలు కులాంతర వివాహం చేసుకున్నారు. తొలిసారి కుమార్తె పుట్టింది. ఆమెకు ప్రస్తుతం ఎనిమిదేళ్లు. కుమారుడు పుట్టడంతో అన్న ప్రసాన చేయించేందుకు ఆటోలో బయలు దేరింది. పెంచలమ్మ తన కుమార్తె, కుమారుడు, తల్లి వెంకటసుబ్బమ్మతో కలసి ఓబులవారి పల్లెకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రైల్వే కోడూరుకు వచ్చేందుకు ఆటోలో బయలుదేరారు.
ఆటోను లారీ....
కానీ ఊహించని విధంగా ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెంచలమ్మ తన తల్లితో పాటు కుమారుడు, కుమార్తెను కోల్పోయింది. ముగ్గురు మరణించారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు కూడా మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story