Mon Dec 23 2024 11:06:25 GMT+0000 (Coordinated Universal Time)
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు
బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒక నీటి గుంటతో స్కార్పియో వాహనం పడి పోవడంతో వాహనంలో ఉన్న ఎనిమిది మంది చనిపోయారు. అందులో ఇద్దరు ప్రాణాలతో బతికి బయటపడ్డారు. బీహార్ రాష్ట్రం పూర్ణియాలో ఈ ఘటన జరిగింది.
అతి వేగమే.....
ఈ ఘటనలో మరణించిన వారంతా కిషన్ గంజ్ లోని సునియా గ్రామస్థులుగా గుర్తించారు. ఒక వివాహ వేడుకకు హాజరై వెనుదిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదానికి కారణం అతి వేగమే కారణమని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వారిని బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేదు.
Next Story