Mon Dec 23 2024 13:01:07 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు.
రాజమండ్రిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. రాజమండ్రికి సమీపంలోని హుకుంపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ధవళేశ్వరానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పుట్టినరోజు వేడుకలకు...
ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. కొందరు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. వీరంతా స్నేహితులు. వీరంతా ఒక పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి వెళుతుండగా కారు వేగంగా వచ్చి విద్యుత్తు స్థంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story