Mon Dec 23 2024 10:58:14 GMT+0000 (Coordinated Universal Time)
Amercia : అమెరికాలో మరోసారి కాల్పులు
అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. బయోవా రాష్ట్రంలో తుపాకీతో ఒక యువకుడు కాల్పులకు తెగబడటంతో ఒక విద్యార్ధి మృతి చెందాడు.
America : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బయోవా రాష్ట్రంలో తుపాకీతో ఒక యువకుడు కాల్పులకు తెగబడటంతో ఒక విద్యార్ధి మృతి చెందాడు. ఈ కాల్పుల ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిలో స్కూల్ అడ్మినిస్ట్రేటర్ తో పాటు మరో నలుగురు విద్యార్థులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి పంపి చికిత్స అందిస్తున్నారు.
నలుగురికి గాయాలు...
అయితే దాడులకు పాల్పడింది ఒక టీనేజర్ గా గుర్తించారు. పదిహేడేళ్ల యువకుడు ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్కూలు సెలవుల అనంతరం తొలిరోజే ఈ ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో తరచూ కాల్పులు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తుంది.
Next Story