Mon Dec 23 2024 15:21:50 GMT+0000 (Coordinated Universal Time)
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మినీ బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన పది మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
తిరుమల వెళ్లి వస్తుండగా...
అనంతపురం జిల్లాల నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. మినీ బస్సులో తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని వస్తుండగా పులగంపల్లి వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story