Mon Dec 23 2024 17:15:04 GMT+0000 (Coordinated Universal Time)
"అనంత"లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమింది మంది మృతి చెందారు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమింది మంది మృతి చెందారు. పెళ్లి బృందంతో వెళుతున్న కారు, లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అనంతపురం జల్లా ఉరవకొండ సమీపంలో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఎనిమిది మంది ప్రమాదస్థలిలోనే మృతి చెందారు.
పెళ్లి బృందంతో....
మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతులంతా అనంతపురం పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. లారీ ఓవర్ స్పీడ్ తో వచ్చి కారును ఢీకొన్న కారణంగానే ఎక్కువ మంది మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story