Mon Dec 23 2024 09:07:19 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఛత్తీస్ఘడ్ లోని గరియాబంద్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ట్రక్కు ఢీకొనడంతో అధిక సంఖ్యలో మృతి చెందారు.
అతి వేగమే...
జాతీయ రహదారిపై వస్తున్న ట్రాక్టర్, ట్రక్కు ఢొకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. ట్రక్కు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడిన వారికి యాభైవేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
Next Story