Tue Dec 24 2024 01:48:21 GMT+0000 (Coordinated Universal Time)
రేణిగుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతికి సమీపంలోని రేణిగుంట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందారు. రేణిగుంట నుంచి కోడూరు వెళుతున్న కారు ముందు వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టింది.
నుజ్జు నుజ్జయిన కారు...
ముందు వస్తున్న లారీని ఢీకొట్టడం, వెనక వస్తున్న లారీ కూడా కారును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళన కరంగానే ఉంది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Next Story