Mon Dec 23 2024 10:48:26 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు
గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మినీ వ్యాన్ ను ఒక గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ట్రక్కును ఢీకొని.....
గుజరాత్ లోని బోటద్ జిల్లా వడోదరా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
Next Story