Thu Dec 26 2024 01:01:31 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఆర్టీసీ డిపో దగ్గర కారు అదుపు తప్పి వేగంగా డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
జూనియర్ ఆర్టిస్టులని....
ఈ ప్రమాదంలో మానస, అబ్దుల్ రహీం, మరొకరు మృతి చెందారు. వీరంతా జూనియర్ ఆర్టిస్టులని తెలిసింది. మితిమీరిన వేగంతో నే కారు డివైడర్ ను ఢొకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story