Sun Dec 22 2024 11:48:54 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.... ఆరుగురు మృతి
కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
కాన్పూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. రోడ్డు పక్కన ఉన్న జనంపైకి బస్సు దూసుకు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. కాన్పూరులోని టాటా మిల్ క్రాస్ రోడ్డు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ఎలక్ట్రిక్ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకు వచ్చింది. ప్రమాదం సమయంలో అక్కడ పదిహేను మంది ఉన్నారు.
9 మంది పరిస్థితి విషమం....
వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. బస్సు బ్రేక్ లు పనిచేయకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో కొన్ని కార్లు, బైకులు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది పరిస్థిితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.
Next Story