Fri Dec 20 2024 04:09:40 GMT+0000 (Coordinated Universal Time)
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
కృష్ణా జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు
కృష్ణా జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెవుటూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, దాదాపు పది మందికి పైగా ప్రయాణికులు గాయాలపాలయ్యారు.
ట్రాఫిక్ జామ్....
రహదారిపై యాక్సిడెంట్ కావడంతో జి కొండూరు - మైలవరం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Next Story