Mon Dec 23 2024 10:29:05 GMT+0000 (Coordinated Universal Time)
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు
కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
బంధువుల వద్దకు....
ధర్మవరానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు కర్నూలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో ఉన్న తమ బంధువులను చూసేందుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆదిలక్ష్మి, శ్రీనివాసులు, భాగ్యలక్ష్మి మృతి చెందారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధిక వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Next Story