Mon Dec 23 2024 01:05:16 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురి మృతి
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ములుగు జిల్లాలోని ఎర్రిగిట్టమ్మ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ఒక ఒక డీసీఎం వ్యాన్ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, మరికొందరు క్షతగాత్రులయ్యారు.
ఆసుపత్రిలో....
పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న నలుగురి పరిస్థిితి ఆందోళనకరంగా ఉంది. వరంగలో ఎంజీఎం ఆసుపత్రిలో వీరకి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. మృతులంతా మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story