Mon Dec 23 2024 10:15:44 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురి మృతి
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు
నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. కారు అతి వేగంగా రావడంతో అదుపు తప్పి బోల్తా పడిందని పోలీసులు చెబుతున్నారు. అతి వేగంతోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద ఈ ప్రమాదం జరిగింది.
చిన్న వయసులోనే....
ఈ ప్రమాదంలో మృతులంతా 25 ఏళ్ల వయసు లోపు వారే. మృతులు కిరణ్మయి, శిరీష, అరవింద్ గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద లభించిన ఐడెంటిటీ కార్డుల ఆధారంగా గుర్తుపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
Next Story