Mon Dec 23 2024 12:14:20 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర ప్రమాదం... ఐదుగురు గల్లంతు
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు.
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గల్లంతయ్యారు. ఆత్మకూరు నుంచి సంగం వద్ద ఉన్న శివాలయంలో నిద్ర చేసేందుకు పన్నెండు మంది బయలుదేరిన ఆటో ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. దీంతో బీరాపేరు వాగులో ఆటో పడిపోయింది. ఈ ఘటనను చూసిన స్థానికులు వెంటనే కొందరిని రక్షించగలిగారు. ఐదుగురి ఆచూకీ మాత్రం తెలియరాలేదు.
గాలింపు చర్యలు...
ఈ ఐదుగురి కోసం రాత్రి నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. ఏడుగురిని స్థానికులు కాపాడితే అందులో ఒక బాలిక మరణించినట్లు తెలిసింది. వాగులో కొట్టుకుపోయిన ఐదుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి వేళ కావడంతో గాలింపు చర్యలు సాధ్యం కాలేదు. ఈరోజు ఉదయం నుంచే బృందాలు వాగులో గాలింపు చర్యలు చేపట్టాయి.
Next Story