Wed Jan 15 2025 19:51:01 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం ..14 మంది మృతి
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు
నేపాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. బస్సు లోయలో పడటంతో ఈ దుర్ఘటన జరిగింది. తూర్పు నేపాల్ లోని శంఖువాసవలోని మాడి నుంచి ఝాపాలోని దమక్ వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. దాదాపు 300 మీటర్ల లోతులో పడింది. దీంతో 14 మంది మరణించారని అధికారులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది వరకూ ప్రయాణికులున్నారు.
లోయలోపడి.....
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐదుగురు గాయపడినట్లు తెలిసింది. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అతివేగం, బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story